నాకు జగన్ అంటే గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం -బండ్ల గణేష్‌

Vijayasai Reddy Vs Bandla Ganesh: *విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్‌ ఫైర్ *కులం ప్రస్తావన తేవడంపై బండ్ల గణేష్‌ అభ్యంతరం

Update: 2022-04-16 01:34 GMT

Vijayasai Reddy Vs Bandla Ganesh: విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్‌ ఫైర్

Vijayasai Reddy Vs Bandla Ganesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత సర్కార్ తమ వర్గానికి చెందినవారికే ఉద్యోగాలు కల్పించేవారని ఆరోపించారు. అంతేకాదు టీడీపీ కుల పార్టీ అన్నారు విజయసాయి రెడ్డి. అయితే వైసీసీ సర్కార్ మాత్రం కుల, మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు.

మరోవైపు విజయసాయి రెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైరయ్యారు. విజయసాయి కులం ప్రస్తావన తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నచ్చని వారిని పేరు పెట్టి తిట్టాలన్నారు. చంద్రబాబును అడ్డు పెట్టుకుని ఓవర్గం వారిని తిట్టకండన్నారు. తనకు జగన్ అంటే గౌరవం అన్న బండ్ల గణేష్.., విజయసాయి రెడ్డిని రాష్ట్రానికి పట్టిన దరిద్రమని ట్వీట్ చేశారు. అన్న నుంచి చెల్లిని దూరం చేయగల్గిన దగుల్బాజీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News