Eluru: ఏలూరు లోక్‌సభ టికెట్ రేసులో అరసవిల్లి అరవింద్..?
Eluru: సిటింగ్ స్థానాన్ని మార్చే యోచనలో అధిష్టానం..?
Eluru: ఏలూరు లోక్‌సభ టికెట్ రేసులో అరసవిల్లి అరవింద్..?
Eluru: అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్తులను ఖరారు చేస్తున్న సీఎం జగన్.. ఏలూరు సిటింగ్ సీటులో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఏలూరు ఎంపీ టికెట్ రేసులో వ్యాపారవేత్త అరసవిల్లి అరవింద్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన అరసవిల్లి అరవింద్.. ఏలూరు టికెట్‌పై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. విద్యాసంస్థలను నడుపుతున్న అరవింద్.. పేరును వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అరవింద్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందని కసరత్తు చేస్తుందట. ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్నారు కోటగిరి శ్రీధర్. అతని స్థానంలో కొత్తవారిని పోటీలోకి దింపాలని చూస్తున్నారట సీఎం జగన్.