కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2019-07-29 08:49 GMT

కాపు రిజర్వేషన్ల అంశంపై.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం జగన్‌తో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై చర్చించారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేస్తూ.. జగన్‌ నిర్ణయించారు. ఈ కమిటీలో.. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఉంటారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ సందర్భంగా కాపుల రిజర్వేషన్లపై కేంద్రం లేఖ రాసినా.. చంద్రబాబు పట్టించుకోలేదని.. చంద్రబాబు తీరుతో కాపులు నష్టపోయారన్న వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

Tags:    

Similar News