AP Curfew: కర్ఫ్యూ నిబంధనల్లో సవరణలు చేసిన ఏపీ సర్కార్

AP Curfew: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2021-05-05 07:15 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్

AP Curfew: ఏపీ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో రాష్ట్రంలో అమలు కానున్న కర్ఫ్యూ నిబంధనల నుండి కొన్నింటికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. బ్యాంకులకు, జాతీయ రహదారి పనులకు,పోర్టులకు మినహయింపు ఇస్తూ సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు సవరణ ఉత్తర్వులను జారీ చేశారు.

నేటి నుంచి ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం12 గంటల‌ వరకే వ్యాపారాలు, రవాణాకు అనుమతి ఇచ్చారు.  తర్వాత అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే 12 తర్వాత అనుమతి ఇవ్వనున్నారు. జగ్గయ్యపేట చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నారు. సరైన కారణం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని...లేదంటే వెనక్కి పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాష్ట్ర సరిహద్దులను మూసివేయనున్నారు.

Tags:    

Similar News