Andhra Pradesh: రేపట్నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం -డీజీపీ సవాంగ్‌

Update: 2021-05-09 13:16 GMT

DGP Gautam Sawang File Photo

Andhra Pradesh: ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. అత్యవసర ప్రయాణికుల కోసం రేపట్నుంచి ఈ-పాస్‌ విధానం అమలు చేయబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని అన్నారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదని, శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని డీజీపీ సవాంగ్‌ హెచ్చరించారు. 

కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104, 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. శుభ కార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News