AP Constable Results 2025: ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా.. విడుదల ఎప్పుడంటే?
AP Police Constable Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల విడుదలను అధికారలు తాత్కాలికంగా వాయిదా వేశారు.
AP Constable Results 2025: ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా.. విడుదల ఎప్పుడంటే?
AP Police Constable Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల విడుదలను అధికారలు తాత్కాలికంగా వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా, అనూహ్యంగా చివరి నిమిషంలో ఆ ప్రక్రియను నిలిపివేసినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత వెల్లడించారు.
ఈ నిర్ణయం వెనుక కారణాన్ని వెల్లడించిన అధికారులు… తుది జాబితాను మరోసారి జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ భావించిందన్నారు. ఎలాంటి అనవసరమైన చిక్కులు ఎదురవకుండా, పారదర్శకతతో ఫలితాలు విడుదల చేయాలనే ఉద్దేశంతోనే వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఫలితాలను పరిశీలించిన అనంతరం బుధవారం ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
2022 జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించారు. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 5,03,487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, పరీక్షకు హాజరైనవారు 4,58,219 మంది మాత్రమే.