Nityanand Rai: ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనని తేల్చిచెప్పిన కేంద్రం

AP Special Status: ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపించింది.

Update: 2023-03-21 10:49 GMT

Nityanand Rai: ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనని తేల్చిచెప్పిన కేంద్రం

AP Special Status: ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేనట్లేనని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మరోసారి పార్లమెంటు సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. ఆర్ధిక లోటు భర్తీకి 14వ ఆర్ధిక సంఘం నిధులు కేటాయించిందని..దీంతో ప్రత్యేక రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందని కేంద్రం వివరించింది.

అయినా ఏపీకి ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని పార్లమెంటులో వివరించింది. స్పెషల్ ప్యాకేజీ కింద 15కోట్ల, 81 లక్షల నిధులను కేంద్రం విడుదల చేసిందని తెలిపింది. 2015 నుంచి 2018 వరకూ EAP పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీని కూడా చెల్లించామని కేంద్రం తెలిపింది. లోక్ సభలో వైసీపీ ఎంపీలు లావు, బాలశౌరీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.

Tags:    

Similar News