Tammineni Seetharam: మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఏపీ అసెంబ్లీ స్పీకర్
Tammineni Seetharam: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అమరావతిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
AP Assembly Speaker Tammineni Seetharam:(File Image)
Tammineni Seetharam: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. సీతారాం గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఆదివారం నుండి అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో అమరావతిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల కరోనా వైరస్ బారిన పడి తమ్మినేని సీతారాం దంపతులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మే 12వ తేదీన కోవిడ్ నుంచి కోలుకున్నారు. సీతారాం కంటే ముందు ఆయన భార్య వాణిశ్రీకి వైరస్ సోకింది. దీంతో దంపతులిద్దరూ శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొంది అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే సీతారం మళ్లీ అనారోగ్యానికి గురికావడంపై ఆందోళన నెలకొంది.