Narsipantmam: జర్నలిస్టులకు వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ భారీ సహాయం!
కరోనా వ్యాధి అందర్నీ కుదిపేస్తోంది. లాక్ డౌన్ పరిస్థితులు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. సామాన్యుల పరిస్థితి రోజు రోజుకూ దయానీయంగా తయారవుతోంది. ఇక జర్నలిస్టుల పరిస్థితి చెప్పలేని విధంగా తయారైంది. వారు విధుల నిమిత్తం నిత్యం ప్రజల్లో తిరగాల్సిందే. చాల మంది జర్నలిస్టులు చాలీ చాలని జీతాలతో బ్రతుకులీడుస్తున్నారు. అటువంటి వారికీ ఈ కరోనా తో ఎదురైన పరిస్థితులు చాలా ఇబ్బందిగా పరిణమించాయి.
ఈ నేపధ్యంలో పంటి బిగువున విధులు నిర్వర్తిస్తున్నారు చాలా మంది జర్నలిస్టులు. అటువంటి జర్నలిస్టుల కష్టాన్ని గమించారు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. స్వతహాగానే ఏదైనా కష్టం అంటే ముందుండి సమాజసేవ చేయడం ఆయనకు నిత్యకృత్యం. ఈ కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో ప్రజల ఇబ్బందులకు కూడా అయన అలానే స్పందిస్తున్నారు. కరోనా డ్యూటీలో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి లాక్ డౌన్ సమయంలో భోజన వసతి కల్పిస్తున్నారు. ఇక అయన జర్నలిస్టుల కష్టాన్ని చూసి చలించి పోయారు. వారి కష్టాల్లో తాను అండగా ఉండాలనుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలోని 200 మంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నాలుగు వేల రూపాయలు విలువ కలిగిన 25kg ల రైస్ బ్యాగ్ తో పాటుగా నాణ్యమైన 11 రకాల నిత్యావసర సరుకులు ను అందచేశారు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను అందచేసి ఆపదలో ఆదుకున్న నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర గణేష్ సేవానిరతిని జర్నలిస్ట్ లు వారి కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకూ ఏ ప్రజా నాయకుడూ కూడా స్పందించని విధంగా స్పందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ కు జర్నలిస్టుల కుటుంబాలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానాయకులు జర్నలిస్తులందరికీ సహకరించాలని వారు కోరుతున్నారు.