Sri Reddy: శ్రీరెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
Sri Reddy: శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.
శ్రీరెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట
Sri Reddy: శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.ఇదే కేసు విషయమై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అనిత కుటుంబ సభ్యులకు ఆమె క్షమాపణ చెప్పారు.
ఈ మేరకు ఆమె వీడియో రిలీజ్ చేశారు. ఈ పోస్టులపై శ్రీరెడ్డిపై చిత్తూరు, అనకాపల్లి, కర్నూల్, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. శ్రీ రెడ్డిని వారానికి ఒకసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని అనకాపల్లి జిల్లాలో నమోదైన కేసులో హైకోర్టు ఆదేశించింది. చిత్తూరులో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కర్నూల్, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో కేసులకు సంబంధించి శ్రీరెడ్డి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది కోర్టు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ, జనసేనకు చెందిన నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆమెపై టీడీపీ, జనసేన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదైన తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులపై క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.