తుపాను బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాయం — ఉచిత నిత్యావసరాల పంపిణీకి జీవో జారీ!
Cyclone Montha ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత నిత్యావసరాల పంపిణీకి జీవో జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావంతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం —
ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ నూనె, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, 1 కిలో చక్కెరను అందించనున్నారు.
మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కిలోల బియ్యం ఇవ్వనున్నారు.
సివిల్ సప్లైస్ కమిషనర్‌కు బియ్యం, పప్పు, నూనె, చక్కెర సరఫరా చర్యలను వెంటనే ప్రారంభించమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయల సరఫరా బాధ్యతను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించింది.
ఈ చర్యతో తుపానుతో నష్టపోయిన ప్రజలకు తక్షణ సాయం అందించడమే కాకుండా, అవసరమైన ఆహార భద్రతను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.