DGP Gautam Sawang on Interstate Arrivals: పాస్ ఉంటే పగటి పూటే ఏపీలోకి అనుమతి

DGP Gautam Sawang on Interstate Arrivals: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేవారికి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.

Update: 2020-07-01 05:39 GMT
Goutam Sawang (File Photo)

DGP Gautam Sawang on Interstate Arrivals: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేవారికి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా చెక్ పోస్ట్ మీదుగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే చెక్ పోస్ట్ దగ్గర అనుమతిస్తారు.థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతి ఉంటుందని... రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అనుమతి ఇస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో ని అన్ని చెక్‌పోస్టుల వద్ద అన్ని ఆంక్షలు కొనసాగుతాయని ఆయన వివరించారు. రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఏపీకి వచ్చేవారు స్పందన యాప్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ పాస్‌ పొందాలని పాస్‌ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు మాత్రమే అనుమతిస్తామని డీజీపీ చెప్పారు.

అయితే పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతులు లేదని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందని తెలిపారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని హెచ్చరించారు. ప్రజలు వ్యక్తి గత జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. బయటికి వస్తే మాస్కు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కోరారు.


Tags:    

Similar News