ఈ నెల 6 న ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ..!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది.

Update: 2020-10-04 04:55 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 6వ తేదీ అంటే మంగళవారం ఉదయం ఢిల్లీ లో ప్రధాని మోడీతో సిఎం జగన్ సమావేశం అవుతారని సమాచారం. ఇటీవల రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పై కేంద్ర హోం మంత్రి అమిత్ శాతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని సిఎం ఆయనను కోరారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీ తొ సిఎం జగన్ సమావేశం కాబోతున్నారు.

ప్రధాని దృష్టికి కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలను తీసుకు వెళ్లి, వాటిని త్వరగా పరిష్కరింపచేయాలని కోరడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం. సీఎం జగన్‌ ఐదో తేదీ ఉదయం పులివెందుల వెళతారు. అక్కడ తన మామగారైన ఈసీ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడినుంచి బయల్దేరి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు.

అంతే కాకుండా కేంద్రంలో ఇటీవల ఏర్పడ్డ రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఎన్దీఏ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీకి చేరుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోడీతొ సమావేశం పై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.  

Tags:    

Similar News