కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ.. రాష్ట్రపతికి లేఖ రాసిన రాజధాని రైతులు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజధాని రైతులు లేఖలు రాశారు.

Update: 2019-12-31 15:39 GMT
Ram Nath Kovind File Photo

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజధాని రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతంచాలని కోరుతూ లేఖలు రాశారు. రాజధాని అంశంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని రైతులు కోరారు. సీఎం మూడు రాజధానపుల నిర్ణయంతో తాము రోడ్డున పడ్డామన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని పేర్కొన్నారు. సీఎం, కొందరి స్వలాభం కోసమే రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారన్నారు. 14 రోజులుగా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నామని, తమ గోడు వినిపించుకునే వారే లేరని రైతులు వాపోయారు.

అధికార పార్టీ నేతలు రాజధాని కోసం మేము చేసిన త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటూ చూస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పెయిడ్‌ ఆర్టిస్టులని హేళన చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులను తమ ఇళ్లపైకి పంపి మమల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ బతుకులు మాకొద్దు మాకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి. అని రాష్ట్రపతికి రాజధాని రైతులు లేఖ రాశారు.

 

Tags:    

Similar News