Anantapur: దొడగట్టలో మేకల మందపై దాడి చేసిన చిరుత

Anantapur: ఈ ఘటనలో ఒక మేక మృతి.. భయాందోళనలో గ్రామస్తులు

Update: 2022-10-21 08:06 GMT

Anantapur: దొడగట్టలో మేకల మందపై దాడి చేసిన చిరుత

Anantapur: అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామ శివారులో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఒక మేక మృతి చెందింది. దీంతో ఆ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఈ గ్రామం చుట్టూ కొండలు ఉండడంతో వన్యమృగాలు నివసించడానికి చాలా అనువుగా ఉంది. దాదాపు మూడు చిరుతలు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయని, వ్యవసాయ పనులకు, మేకల కాపలాకు వెళ్లే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళుతున్నారు.. ఈ విషయంపై పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు తెలిపినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News