కూలీలను భయభ్రాంతులకు గురి చేసిన భారీ కొండచిలువ

Update: 2019-11-20 07:51 GMT

చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం, దీనబంధు పురంలో భారీ కొండచిలువ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. రైతు చంద్రన్ పొలంలోని చెరుకు తోటలో కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానిక కూలీలు చెరకు తోట నరుకు తుండగా ఎనిమిది అడుగుల భారీ కొండచిలువ బయటకు వచ్చింది. దీంతో కూలీలు భయంతో పరుగులు తీసారు.

అయితే ఓ మహిళ కూలీ మాత్రం ధైర్యంగా కొండచిలువ తోక పట్టుకుని బయటకు లాక్కొచ్చింది. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పొలంవద్దకు చేరుకున్న అధికారులు కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.



Tags:    

Similar News