ఈరోజు (మే-17-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
#Andhra pradesh news, #telangana news, #live updates
Live Updates
- 17 May 2020 10:17 PM IST
తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యా ప్రయత్నం.. యువతి మృతి
♦ తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చిడుమూరు గ్రామంలో విషాదం. తమ ప్రేమకు పెద్దల నుంచి వచ్చిన అభ్యంతరం పై మనస్తాపం. దానితో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం.
♦ ప్రియురాలు సున్నం సుజాత(18) మృతి, ప్రియుడు అప్పారావు పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు
- 17 May 2020 10:14 PM IST
తిరుమల లో శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు!
♦ కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితులలో ఆలయాలన్నీ మూసివేశారు.
♦ తిరుమల శ్రీవారి ఆలయం కూడా భక్తలకు దూరంగా ఉండిపోయింది.
♦ లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ప్రారంభం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
♦ ఈ నేపధ్యంలో ఆలయం క్యూలైన్ల లో భౌతికదూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
♦ అన్ని పరిస్థితులు చక్కబడి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాకా నిబంధనల ప్రకారం ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించే అవకాశం ఉంది.


- 17 May 2020 9:37 PM IST
కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజా రామ్ చందర్ (రాజబాబు) మృతి
♦ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తన స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరు గ్రామంలో మృతి చెందిన రాజబాబు
♦ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో విశేష సేవలందించిన రాజబాబు

- 17 May 2020 9:37 PM IST
తెలంగాణలో ఈరోజు కొత్తగా 42 కేసులు నమోదు
♦ ఈ రోజు 42 కేసులు నమోదు అయ్యాయి.
♦ ఇందులో 37 కేసులు GHMC పరిధిలోనివి.
♦ తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1551 కి చేరింది.
♦ రాష్ట్రంలో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 34 మంది చనిపోయారు.
- 17 May 2020 7:59 PM IST
లాక్ డౌన్ 4.0 - కేంద్ర మార్గదర్శకాలు!
దేశంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త లాక్డౌన్లో గైడ్‌లైన్స్‌ను హోం శాఖ విడుదల చేసింది. ఆ వివరాలివీ...
• జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు సర్వీసులు , పాఠశాలలు, కళాశాలలు, హోటల్స్, రెస్టరెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, ఆడిటోరియమస్స్, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం అన్ని రకాల సభలకు అనుమతి లేదు.
• కంటైన్మెంట్ జోన్లలో కాకుండా మిగిలిన అన్ని జోన్లలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, సొంత వాహనాల ప్రయాణం. అయితే దీనికి ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి.
• కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసర, అత్యవసర వస్తువులకు అనుమతి.

- 17 May 2020 7:24 PM IST
భారత్ లో లాక్ డౌన్ కొనసాగింపు
♦ మరో 14 రోజులు లాక్ డౌన్ కొనసాగిస్తూ హోమ్ శాఖ ఉత్తరులు
♦ ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగింపు
♦ కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
♦ మరి కాసేపట్లో మార్గదర్శకాలు విడుదల
- 17 May 2020 2:25 PM IST
హాట్స్ ఆఫ్ : అర్ధరాత్రి వలస కూలీల ఆకలి తీర్చిన విజయనగరం ఎస్పీ!
కరోనా వైరస్ వ్యాప్తికి లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సొంత నివసాలకి వెళ్ళాలి అనుకున్న వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.
- 17 May 2020 2:02 PM IST
3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారంతా తెలంగాణకు వచ్చేందుకు ప్రభుత్వం వారికి పాసులు జారీ చేసి స్వరాష్ట్రానికి రప్పించుకుంటుంది.
- 17 May 2020 12:12 PM IST
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై గవర్నర్ ఆరా
కరోనా ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తెలుసుకున్నారు.
-మరిన్ని వివరాలు - 17 May 2020 12:10 PM IST
ఏపీలో తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు..
ఏపీలో కరోనా కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. తాజాగా మరో 25 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,230 కి చేరింది.




