ఏపీలో తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు..103 మంది డిశ్చార్జ్

Samba Siva Rao
Updated on: 17 May 2020 12:45 PM IST
ఏపీలో తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు..103 మంది డిశ్చార్జ్
X
Representational Image

ఏపీలో కరోనా కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. తాజాగా మరో 25 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,230 కి చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో (10AM-10AM) 9,880 సాంపిల్స్ ని పరీక్షించగా 25 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.103 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 747 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,433 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 4, గుంటూరులో 4, కర్నూలు 3, నెల్లూరు జిల్లాల్లో 1, విశాఖపట్నంలో 3 , శ్రీకాకుళం. 7, ప్రకాశం 3, కేసు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story