ఈరోజు (మే-17-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

#Andhra pradesh news, #telangana news, #live updates


Show Full Article

Live Updates

  • 17 May 2020 6:39 AM GMT

    అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది..

    ఆదివారం చికాగో నుంచి రానున్న తొలి విమానంలో 33మంది శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

    ♦ అక్కడి నుంచి వారందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి తర్వాత ఇళ్లకు పంపిస్తారు..

  • 17 May 2020 6:29 AM GMT

    గన్నవరం వెటర్నరీ కళశాలశాల సమీపంలోని జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం...

    వలస కూలీలతో వెళుతున్న ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢికొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న వలసకూలీలో ఒకరు మృతి, పలువురుకి తీవ్రగాయాలు...

    చెన్నై నుండి బెంగాల్ కు వలస కూలీలను తీసుకు వెళుతున్న బస్సు...

    ♦ తెల్లవారు జామున జరిగిన సంఘటన

    ♦ మృతి చెందిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.

  • 17 May 2020 6:09 AM GMT

    గోదావరి నీళ్లపై సీఎం సమీక్ష..

    గోదావరి ఆయకట్టు పరిధిలో మంచి దిగుబడి ఫలితాలు పొందేందుకు అమలుచేయాల్సిన ప్రణాళికపై ఆదివారం సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిని నీటిని సమర్థంగా వినియోగించుకోవడంపై చర్చించనున్నారు.

    -మరిన్ని వివరాలు

  • 17 May 2020 6:07 AM GMT

    తీవ్ర తుఫానుగా అంపన్..

    మూడు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా రూపాంతరం చెందింది.

    -మరిన్ని వివరాలు

  • 17 May 2020 5:49 AM GMT

    నిర్మ‌ల్ ‌ జిల్లాలోభాగ్య‌న‌గ‌ర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

    జాతీయ ర‌హ‌దారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుత‌ప్పిన లారీ

    ♦ లారీలో ప్ర‌యాణిస్తున్న 70 మంది వ‌ల‌స కార్మికులు

    ♦ హైద‌రాబాద్ నుంచి ఘోర‌ఖ్ పూర్ వెళ్ళుతున్న వ‌ల‌స కార్మికులు

    ♦ 20 మందికి స్ప‌ల్ప గాయాలు

    ♦ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు



  • 17 May 2020 5:48 AM GMT

    రోజూ 500 టన్నుల బత్తాయి కొంటాం-మంత్రి

    చంద్రబాబుకు ప్రచార ఆర్భాటమే ఎక్కువ తప్ప.. ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. సీఎం జగన్‌ మాత్రం చెప్పిన దానికన్న అధికంగా రైతు భరోసా ఇస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులు సీఎం జగన్‌ చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్‌ ఆదేశాలతో శనివారం నుంచి ప్రతి రోజు 500 టన్నుల బత్తాయిని కొనుగోలు చేస్తున్నామన్నారు.

    ప్రభుత్వం రైతు కోసం ఇన్ని మంచి పనులు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు అబద్దాలు చెబుతున్నారో తెలియడంలేదన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ శంకూస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును సీఎం జగనే పూర్తి చేస్తారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.




     


  • 17 May 2020 2:04 AM GMT

    తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద రోడ్డు ప్రమాదం

    తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.

    గోపాల్ బాబా ఆశ్రమం ఎదురుగా ఆగివున్న కంకర లోడ్ భారత్ బెంజ్ లారీని, వెనక వస్తున్న మరో లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు.

    నుజ్జునుజ్జయిన క్యాబిన్, క్లీనర్ కాలు.ఆస్పత్రికి తరలింపు.



     


  • 17 May 2020 1:54 AM GMT

    పోతిరెడ్డి పాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన కొత్త నీటి పథకానికి సంబంధించి చర్చించేందుకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సూచించారు. ఈ విషయాన్ని ఆయన తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు రాసిన లేఖలో తెలిపారు.కొత్త నీటి పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సాంకేతికంగా పరిశీలించాలని.. అప్పటివరకు ముందుకు వెళ్లకుండా ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీని కోరాలని చెప్పామని మంత్రి పేర్కొన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తన లేఖలో వివరించారు.

Print Article
More On
Next Story
More Stories