గోదావరి నీళ్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..

గోదావరి నీళ్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
x
CM KCR(File photo)
Highlights

గోదావరి ఆయకట్టు పరిధిలో మంచి దిగుబడి ఫలితాలు పొందేందుకు అమలుచేయాల్సిన ప్రణాళికపై ఆదివారం సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

గోదావరి ఆయకట్టు పరిధిలో మంచి దిగుబడి ఫలితాలు పొందేందుకు అమలుచేయాల్సిన ప్రణాళికపై ఆదివారం సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిని నీటిని సమర్థంగా వినియోగించుకోవడంపై చర్చించనున్నారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి హాజరుకావాలని గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులకు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమావేశంలో గోదావరి జలాలను సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకునేలా ప్రణాళికను రూపొందించనున్నారనే సమాచారం. కాళేశ్వరంతోపాటు దేవాదుల, ఇతర ప్రాజెక్టుల ద్వారా 2020-21 నీటి సంవత్సరంలో ఎంత నీటిని వినియోగించుకోవాలనే దానిపై చర్చించనున్నారని సమాచారం. అంతే కాకుండా వానాకాలం సీజన్‌లో భారీ ఎత్తున సాగు విస్తీర్ణం జరిగే అంశంపైనా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి గోదావరి నది పరివాహక జిల్లాల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కేటీ రామారావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డిలను ఆహ్వానించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సి మురళీధర్, ఎస్సారెస్పీ సీఇ శంకర్, కాళేశ్వరం సీఇ వెంకటేశ్వర్లు, ఇతర సీనియర్ నీటి పారుదల ఇంజనీర్లను ఆహ్వానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories