రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై గవర్నర్‌ ఆరా

రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై గవర్నర్‌ ఆరా
x
Tamilisai Soundararajan (File Photo)
Highlights

కరోనా ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తెలుసుకున్నారు.

కరోనా ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తెలుసుకున్నారు. ఈ మేరకు కరోనా రాష్ట్ర నిపుణుల కమిటీ సభ్యుడు బి.కరుణాకర్‌రెడ్డిని, కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ)లను రాజ్‌భవన్‌కు పిలిచి వివరాలను ఆరాతీసారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఎక్కువగా చిన్న చిన్న ఫంక్షన్లవలన, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీల కారణంగా పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర యంత్రాంగం వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కఠినంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని ఆయన తెలిపారు. అనంతరం గవర్నర్ తమిళిసై పీజీ మెడికల్‌ ప్రవేశాలు, విద్యార్థుల నుంచి ఫీజులకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపైనా వీసీని వివరణ కోరారు. దీంతో కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ ) మాట్లాడుతూ ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆయన సమాధానం తెలిపారు. పీజీ మెడికల్‌ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వడానికి మరికొంత సమయం ఇస్తామని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories