లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలు వచ్చాయోచ్..

లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలు వచ్చాయోచ్..
x
Highlights

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ లాక్డౌన్ నేటితో ముగియబోతోంది.. ఇక రేపటినుంచి ఫోర్త్ ఫేజ్ అమల్లోకి రానుంది.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ లాక్డౌన్ నేటితో ముగియబోతోంది.. ఇక రేపటినుంచి ఫోర్త్ ఫేజ్ అమల్లోకి రానుంది. 4.0 కొత్తగా ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగ్గట్టే కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ ను కూడా వెల్లడించింది. అందులో ముఖ్యంగా..

లాక్‌డౌన్‌ 4.0 లో వీటిపై నిషేధం కొనసాగుతుంది

* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. అయితే దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించిన వాటికి మాత్రం, కేంద్ర హోమ్ శాఖ‌ అనుమతితో మినహాయింపు ఉంటుంది.

* మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు

* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు యధాతదంగా మూసి ఉంటాయి. అయితే ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించుకోవచ్చు.

* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. అయితే, వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి

మాత్రం అనుమతి ఉంటుంది.

* సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్ కు అనుమతి లేదు.

* రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలకూ కూడా అనుమతి లేదు.

* ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు కిచ్‌న్ లకు మాత్రం అనుమతి ఉంది.

* మతపరమైన కార్యక్రమాలకు నిర్వహించడానికి అనుమతి లేదు.

* ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడుపుకోవచ్చు.

* రాష్ట్రాల మధ్య సమన్వయంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు ఒకే చెప్పింది కేంద్రం. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలి.

కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు

* ఎక్కడెక్కడ రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి.

* రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు.

* కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలకు అనుమతి లేదు.

* కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉంచడం తోపాటూ అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలి.

రాత్రి కర్ఫ్యూ

ఇక రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలులో ఉంటుంది.. అత్యవసర సేవలు మినహా స్థానిక అధికారులు ఆదేశాలు లేనిదీ బయట తిరగడానికి అనుమతి లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories