3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం

3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం
x
Highlights

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారంతా తెలంగాణకు వచ్చేందుకు ప్రభుత్వం వారికి పాసులు జారీ చేసి స్వరాష్ట్రానికి రప్పించుకుంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కుసుల సంఖ్య రోజు రోజుకు అధికం అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు స్వరాష్ట్రానికి రానివ్వకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ లలో కేసుల సంఖ్య అధికంగా నమోదవుతుండడంతో వారి రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న తెలంగాణ వాసులకు గత మూడు రోజులుగా పాసుల జారీ నిలిపేసింది. ప్రభుత్వం మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు పాసులు జారీచేయొద్దని తెలిపింది. ఏపీలో కేసుల సంఖ్య, మరణాల రేటు తక్కువగా ఉన్నా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఏపీ నుంచి రావాలనుకుంటున్న వారికి సైతం పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా గణాంకాలను చూసుకుంటే కరోనా పాజిటిక్ కేసుల్లో మహారాష్ట్ర, మరణాల రేటులో గుజరాత్‌ దేశంలోనే ముందంజలో ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ప్రభుత్వం పాసుల జారీని నిలిపేసింది.

కొన్ని రోజుల ముందు వరకు తెలంగాణకు రావాలనుకునే వారికి పాసులు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్ర సచివాలయంలో 24 గంటల కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల్లో 100 మంది అధికారులను నియమించింది. దీంతో అధికారులు ఇప్పటివరకు 17,500 పాసులు జారీచేయగా, 80 వేల మంది స్వరాష్ట్రానికి చేరుకున్నారు. 040–23450624 కంట్రోల్‌ రూం నంబర్లలకు ప్రతి రోజు సుమారుగా 2 వేల కాల్స్‌ వస్తే, రోజుకు 500–600 పాసులు జారీ చేస్తున్నారు. పాస్ జారీచేయడానికి ముందు వారు ఏం పనిమీద రాష్ట్రానికి రావాలనుకుంటున్నారు, వారు తెలంగాణ వాసులేనా అన్ని విషయాలను కూడా స్పష్టం చేసుకుంటున్నారు. వారి పేర్లు, వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఈ పాసులు జారీ చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే వారిని పోలీసులు అధికారులు చెక్‌పోస్టుల వద్ద ఆపి జ్వరం, జలుబు, ఇతర లక్షణాల కోసం స్క్రీనింగ్‌ చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని తిప్పి పంపేస్తున్నారు. మిగతావారికి చేతులపై 14 రోజుల హోం క్వారంటైన్‌ ముద్ర వేసి వారి స్వస్థలలాకు పంపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories