Amarnath Yatra 2020 Cancelled: ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర రద్దు..

Amarnath Yatra 2020 Cancelled: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతున్న క్రమంలో ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు..

Update: 2020-07-21 14:58 GMT

Amarnath Yatra 2020 Cancelled: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతున్న క్రమంలో ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు.. మంగళవారం జమ్మూ, కె లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు, ఈ యాత్ర జూలై 21 నుండి ప్రారంభమై ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.

" ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా, ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రను నిర్వహించడం మంచిది కాదని అమర్‌నాథ్‌ బోర్డు హృదయపూర్వకంగా నిర్ణయించింది అంతేకాకుండా ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నాం అని ప్రకటించినందుకు గాను విచారం వ్యక్తం చేసింది. లక్షలాది మంది భక్తుల మనోభావాలను బోర్డు తెలుసుకొని గౌరవిస్తుంది అందులో భాగంగా ఉదయం మరియు సాయంత్రం వర్చువల్‌ దర్శన సదుపాయాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. అమర్‌నాథ్ గుహ హిందూ మతంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.. సవాలు చేసే పర్వత భూభాగాల్లో వేలాది మంది భక్తులు వార్షిక తీర్థయాత్ర చేస్తారు.

ఇక దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 37,148 కేసులు నమోదు కాగా, 587 మంది ప్రాణాలు విడిచారు. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 11,55,191 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,02,529 ఉండగా, 7,24,577 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 28,084 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,33,395 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,43,81,303 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Full View

Tags:    

Similar News