Mahabubabad: మహబూబాబాద్‌లో దారుణం వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి!
Mahabubabad: మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొని తండాకు చెందిన మహిళ అక్కడికక్కడే మృతి. ఆటో స్టాండ్ వైపు వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం.
Mahabubabad: మహబూబాబాద్‌లో దారుణం వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అండర్ బ్రిడ్జి వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ పాదచారిని బలంగా ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహబూబాబాద్ నుంచి కురవి వైపు వెళ్లేందుకు ఆటో స్టాండ్ దిశగా అండర్ బ్రిడ్జి గుండా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
లారీ ప్రమాదకరంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతురాలు కురవి మండలం, నల్లెల గ్రామ శివారులోని సూర్య తండాకు చెందిన అజ్మీర మంగత (45)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అండర్ బ్రిడ్జి వద్ద నిరంతరం ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.