Gudur: నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన టీవీఎల్ఎన్ శాస్త్రి

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా టీవీఎల్ఎన్ శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తామని వెల్లడి.

Update: 2026-08-24 10:11 GMT

Gudur: నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన టీవీఎల్ఎన్ శాస్త్రి

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా టీవీఎల్ఎన్ శాస్త్రి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా గూడూరు ఎంపీఓ ఎ. సత్యనారాయణ ఎంపీడీవో గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీవీఎల్ఎన్ శాస్త్రికి కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందిస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.

Tags:    

Similar News