Bhupalpally: జీవో 97 రద్దు డిమాండ్‌తో కలెక్టరేట్ ముట్టడి – విద్యార్థి నేతల అరెస్ట్
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నిరసన. జీవో 97 రద్దు చేయాలని డిమాండ్. ఉద్రిక్తత, పలువురి అరెస్ట్.
Bhupalpally: జీవో 97 రద్దు డిమాండ్‌తో కలెక్టరేట్ ముట్టడి – విద్యార్థి నేతల అరెస్ట్
భూపాలపల్లి: పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టేందుకు రాగా పోలీసులు భారీగా మోహరించి.
విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసారు.. విద్యార్థులు మైనర్లు కావడం తో వారిని అరెస్ట్ చేయలేదు. పాలిటెక్నిక్ విద్యను ఎస్‌బీటీఈటీ (SBTET) పరిధిలోనే కొనసాగించాలని జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనతో కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు..