Thorrur: స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Thorrur: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి.

Update: 2026-08-24 09:48 GMT

Thorrur: స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోనీ ఎంపీడీఓ కార్యాలయంలో ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి.

ఎమ్మెల్యే మాట్లాడుతూ

గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, డూప్లికేట్ రేషన్ కార్డులు తయారు చేయడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది.

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని పథకాలు ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళుతున్నాం,అప్పుల ఊబిలో ఉన్న కూడా పథకాలను ముందుకు తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,అందుకు ముఖ్యమంత్రి గారికి మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News