Rayaparthi: రాయపర్తి PHCని సందర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Rayaparthi: రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా, అధికారులకు పలు సూచనలు.

Update: 2026-08-24 11:48 GMT

Rayaparthi: రాయపర్తి PHCని సందర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి వారు సందర్శించారు..

ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మందులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగే విధంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, పరిశుభ్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News