Warangal: భద్రకాళీ ఆలయంలో వైభవంగా శాకంభరీ నవరాత్రులు

Warangal: వరంగల్ భద్రకాళీ ఆలయంలో 5వ రోజు శాకంభరీ నవరాత్రులు. విరోధిని, వహ్నివాసినిగా అమ్మవారి దర్శనం. సారె సమర్పించిన వందలాది మంది భక్తులు.

Update: 2026-07-19 12:02 GMT

Warangal: భద్రకాళీ ఆలయంలో వైభవంగా శాకంభరీ నవరాత్రులు

వరంగల్: శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం గం|| 04-00లకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి "విరోధిని" గాను షోడశీ క్రమాన్ని అనుసరించి "వహ్నివాసిని" గాను అంకరించి పూజారాధనలు నిర్వహించారు.

విరోధిని నిత్య అమ్మవారు భక్తులకు శత్రు విజయము కలిగించును వహ్నివాసిని కర్మఫలప్రాప్తి కలిగించుటయేగాక ఐశ్వర్యాభివృద్ధి కల్గించునని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మంచినీటి వసతి. ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు ఆలయ ఈఓఓ శ్రీమతి రామల సునీత పర్యవేక్షించారు. ఈ రోజు ఆదివారం కూడా కావడంతో భక్తులు అమ్మవారి దర్శనమునకు పోటెత్తారు.

వరంగల్ మహానగరంలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్లోని పలు ప్రాంతాలకు చెందిన నారీమణులు ఆషాడ శు॥ పంచమిని పురస్కరించుకొని వందలాదిగా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ రోజు పంచమి తిధి కావడంతో పంచమీ పంచభూతేషి పంచతన్మాత్రసాయికా అని లలితా సహస్రనామ ప్రమాణం.

పంచభూతములకు ఈ జగన్మాతయే అధినాయకి. ఈ రోజు అమ్మవారికి సారె నమర్పించడవం వల్ల పంచభూతములకు ప్రీతి కలిగి ప్రకృతి నమతౌల్యం కలిగి ఉండి ప్రాణి కోటి నుఖనంతోషాలతో వర్ధిల్లుతుందని ముత్తయిదువులు అమ్మవారికి సారె నమర్పిస్తారని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. రామల సునీత కార్యనిర్వహణాధికారి.

Tags:    

Similar News