Jangaon: దేవరుప్పుల బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
Jangaon: దేవరుప్పులలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకుల దిశానిర్దేశం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు.
Jangaon: దేవరుప్పుల బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
జనగామ జిల్లా: భారతీయ జనతాపార్టీ ( బీజేపి) దేవరుప్పుల మండల కార్యవర్గ సమావేశం ఈరోజు దేవరుప్పుల మండల కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు.ఈసమావేశానికి బీజేపీ దేవరుప్పుల మండల అధ్యక్షుడు బస్వా భాస్కర్ గౌడ్ సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగ రామ్మోహన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు రాజోజు నరసింహాచారి,జిల్లా ధార్మిక సేల్ కో కన్వీనర్ బాష్పాక సుధాకర్,జిల్లా ఉపాధ్యక్షులు సృజన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బస్వా మహేందర్ హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.
ఈసందర్బంగా లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక ద్రృష్టి సారించింది అని,దీనిలో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షులు నితీన్ నభీన్ గారు తెలంగాణలో మూడు రోజులు విస్తృతంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో బీజేపీ కార్యకర్తలకు,నాయకులకు సమన్వయం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం మార్గ నిర్దేశం చేసి వెళ్ళారని,బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజలతో మమేకమై నరేంద్ర మోడీ గారి పన్నెండు ఏళ్ల సుపరిపాలన,
పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ప్రజల్లో బీజేపీ పార్టీ పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతీ కార్యకర్త క్రృషి చేయాలని,రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీ శ్రేణులు చురుగ్గా పాల్గొని ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారమ్స్ పూర్తి చేయడంలో సహకరించి ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు పొందే విధంగా బీఎల్వోలతో సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు.ఈసమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు కొత్త సత్తిరెడ్డి , మాధవ రెడ్డి, దుబ్బ రాజశేఖర్, బస్వా రమేష్,బూతు అధ్యక్షులు,ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.