Narsampet: నర్సంపేట ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపాలి

Narsampet: నర్సంపేటలో రైతు అవగాహన సదస్సు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా శాస్త్రీయ పద్ధతుల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచన.

Update: 2026-07-19 12:06 GMT

Narsampet: నర్సంపేట ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపాలి

నర్సంపేట: మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి వనరుల లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల సాగు విధానాన్ని మార్చుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు.

ఆదివారం నర్సంపేట రైతు వేదికలో ఏర్పాటుచేసిన నీటి వనరుల లభ్యత వర్షాభావ పరిస్థితులు మరియు ఆరుతడి పంటలపై రైతులతో వారు పాల్గొని రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించడమైనది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో 6 మండలాల పరిధిలోని రైతులు వర్షాభావ పరిస్థితుల దృశ్య ప్రభుత్వ నిర్దేశాల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సిందిగా వారు సూచించారు.

నర్సంపేట నియోజక వర్గ పరిధిలో మొత్తం 1,30 వేల ఎకరాల వ్యవసాయ సాగు చేస్తున్నాం అని, ఇట్టి సాగు పాకాల చెరువు,రంగయ్య చెరువు,మాదన్నపేట చెరువు కింద సాగుచేయడం జరుగుతుంది. మిగతా చిన్న చిన్న చెరువులు , బోర్ల ద్వారా పడుతున్నాయని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో

ఎల్ నినో ప్రభావం వలన మబ్బులు కనిపిస్తున్నాయి కాని ,వర్షాలు పడకపోవడం, లేదా అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఆరుతడి పంటలు వేసుకోవాలని వారు పేర్కొన్నారు.

చెరువుల కింద రైతులు అఖిలపక్షం కమిటీలను ఏర్పాటు చేసుకొని రానున్న కాలంలో రైతులు ఎలాంటి పంటలు పండించాలి అనే దాని కార్యచరణ ప్రణాళికలు చేయాలని అందుకు అధికార యంత్రాగం కృషి చేయాలని అన్నారు.

యాసంగి ప్రణాళికలు కూడా సిద్ధం చేసేలా క్షేత్రస్థాయి అధికారులు కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు తడి పంటల సాగుపై శాస్త్రీయ సూచనలను పాటించాలని సూచించారు.

వ్యవసాయం, ఉద్యానవనం, నీటిపారుదల, భూగర్భ జలాలు, వాతావరణ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను రైతులకు వివరించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

రైతులు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.

ఈసందర్భంగా ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడమైనది.

ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి,

నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, జెడ్పి సీఈవో రామ్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు, ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ ఆనందం, ఇరిగేషన్ ఎస్. ఈ, సంబంధిత మండలాల తహసిల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News