Jangaon: జనగామ ప్లాస్టిక్ రహిత శిక్షణ తరగతులతో ఉపాధ్యాయుల ఆదర్శం

Jangaon: జనగామలో ప్లాస్టిక్ పట్ల విముఖత చూపుతూ ఆదర్శంగా నిలిచిన పాలకుర్తి ఉపాధ్యాయులు. స్టీల్ పాత్రలను వాడి పర్యావరణ పరిరక్షణకు కొత్త బాటలు వేశారు.

Update: 2026-07-19 12:30 GMT

Jangaon: జనగామ ప్లాస్టిక్ రహిత శిక్షణ తరగతులతో ఉపాధ్యాయుల ఆదర్శం

జనగామ జిల్లా: మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపించడమే అసలైన బోధన అని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. నిత్యం తరగతి గదుల్లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఈ గురువులు, తమ ఆచరణతో సమాజానికి సరికొత్త సందేశాన్నిచ్చారు.

జనగామలో జరిగిన జిల్లాస్థాయి మూడు రోజుల శిక్షణ తరగతులకు హాజరైన వీరు ప్లాస్టిక్, ఫైబర్‌ ప్లేట్లను పూర్తిగా పక్కనబెట్టారు. తమ ఇళ్ల నుంచే స్టీలు ప్లేట్లు, టీ గ్లాసులు, స్టీల్ బాటిళ్లు వెంట తెచ్చుకున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో వాటిలోనే తింటూ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతిఒక్కరూ సింగిల్‌-యూజ్‌ ప్లాస్టిక్‌ను విడిచిపెట్టి, పర్యావరణహితమైన వస్తువులనే వాడాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.

వీలైతే... కాదు, కాదు వీలు చేసుకొని మనకు రేపటినుండి(20.07.2026) మండల స్థాయిలో జరిగే ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు హాజరయ్యే ఉపాధ్యాయులందరం ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చెద్దాం...ఆదర్శంగా నిలుద్దాం... ఆరోగ్యంగా ఉందాం... ప్లాస్టిక్ వదిలేద్దాం - పర్యావరణాన్ని కాపాడుకుందాం.

Tags:    

Similar News