Jangaon: జనగామలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్కర వేడుకలు
Jangaon: జనగామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ పుష్కర వేడుకల్లో పాల్గొన్న చిన్న జీయర్ స్వామి. మహా సుదర్శన యాగంతో హోరెత్తిన ఆలయ ప్రాంగణం. భక్తుల ఆధ్యాత్మిక సందడి.
Jangaon: జనగామలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్కర వేడుకలు
జనగామ జిల్లా: దేవతల పేరుతో నిర్వహించే బ్రహ్మోత్సవాలు మానవాళి సంక్షేమాన్ని కె ఉపయోగపడతాయని శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు జనగామ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం జరిగి 36 వసంతాలు నిండిన సందర్భంగా నిర్వహిస్తున్న తృతీయ పుష్కర వేడుకలలో జియర్ స్వామి పాల్గొని ప్రారంభించి ఉత్సవాలకు సారథ్యం వహించారు. ఆదివారం ఉదయం అగ్ని పురుషుని ఆగమనముతో మహా సుదర్శన యాగం కు అంకురార్పణ జరిగింది.
శనివారం రాత్రి ఉత్సవాలను ప్రారంభించిన జియర్ స్వామి పర్యవేక్షణలో వేద పండితులు విజ్ఞ నివారకుడైన విశ్వక్సేన అలాగే భూమిని కాపాడే స్వామి భూవరహా స్వాముల పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ దేవాలయ ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ పెద్ద జీయర్ స్వామి వారు భూమి పూజ చేసిన ఈ దేవాలయం తృతీయ పుష్కర వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న బాణాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకొనే విధంగా స్వామి ఆశీస్సులు లభించాలని ఆశీర్వదించారు
వేద పండితుల మంత్రోచ్ఛరజెణాల మధ్య జమ్మి కర్ర రావి కర్ర మథనం తో ఉత్పన్నమైన అగ్ని పురుషున్ని భక్తులు కరతాల ధ్వనులతో ఆహ్వానించి తరించారు. అనంతరం సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి దంపతుల అన్యోన్య ప్రాప్తి కోసం నిర్వహించిన శ్రీ వైనతేయ యిష్టి లో 150 మంది దంపతులు పాల్గొన్నారు.
అలాగే యాగంలో ఈ రోజు 100 మంది దంపతులు పాల్గొన్నారు మరో 75 మంది దంపతులు స్వామి వారి వద్ద మంత్రోపదేశం పొందినట్లు ఉత్సవాల నిర్వాహకులు సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి తెలిపారు ఈ రోజు ఉదయం పూజ అనంతరం చిన జీయర్ స్వామి వారు స్వయంగా భక్తులకు తీర్థ వితరణ చేశారు వేడుకలో పాల్గొన్న యావన్మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.జనగామ పట్టణం తో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ రోజు యాగంలో భాగస్వాములైన దంపతులలో మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ దంపతులు ఆలయ గౌ అధ్యక్షుడు ఫజ్జూరి కృష్ణమూర్తి గోపయ్య లక్ష్మీనర్సయ్య డా.లక్ష్మీ నారాయణ పబ్బ రవీంద్రనాథ్ గుప్త శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి కే. వెంకటరత్నం కౌకోటి రామారావు వజినపల్లి శ్రీనివాస్ పానుగంటి యాదగిరి అశోక్ నరసింహారావు మహేంద్ర రెడ్డి తమిశెట్టి మల్లికార్జున్ రాజా సంపత్ గౌడ్ అయిత హరి ఆత్మారాం వెంకటరత్నం మురళి రంజిత్ కుమార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రదేశాలలో స్థానిక భక్తులు మహిళా భక్తమండలి సభ్యులు వికాస తరంగిణి సభ్యులు ఉచిత సేవలందించి స్వామి వారి ఆశీస్సులు పొందారు.