Jordar Varthalu: ఇట్లైతే మళ్లీ అధికారంలోకి రాము

Jordar Varthalu: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో వలస నేతల పెత్తనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-04-04 04:50 GMT

Jordar Varthalu: ఇట్లైతే మళ్లీ అధికారంలోకి రాము

Jordar Varthalu: కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పార్టీ అధిష్టానం మరియు మంత్రుల ముందే తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టిన అసలైన కార్యకర్తలను కాదని, అధికారంలోకి వచ్చాక చేరిన వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి సమక్షంలోనే ప్రేమసాగర్ రావు నిప్పులు చెరిగారు. "ఎన్నికల ముందు, తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్లు వేదికలపై కూర్చుని పాత కార్యకర్తలపై పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు" అని ఆయన హెచ్చరించారు. కొత్తగా వచ్చేవాళ్లు పార్టీపై ప్రేమతో కాకుండా, కేవలం అధికారం అనుభవించేందుకే వస్తున్నారని, రేపు అధికారం లేకపోతే వాళ్లు పార్టీలో ఉండరని ఆయన కుండబద్దలు కొట్టారు.


Full View


Tags:    

Similar News