Off The Record: సౌత్ పొలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. కేరళలో తెలుగు నేతలు సత్తా చాటుతారా?

Off The Record: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నేతల హవా! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యూడీఎఫ్ కూటమి కోసం, ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎన్డీఏ కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

Update: 2026-04-04 02:02 GMT

Off The Record: సౌత్ పొలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. కేరళలో తెలుగు నేతలు సత్తా చాటుతారా?

Off The Record: కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి కేరళ గడ్డపై తెలుగు రాష్ట్రాల నేతలు తమ మార్కు రాజకీయాలతో హోరెత్తిస్తున్నారు. అటు కాంగ్రెస్ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ తరపున ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యూహప్రతివ్యూహాలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన 'ఆరు గ్యారంటీల' మంత్రాన్ని రేవంత్ రెడ్డి కేరళలోనూ ప్రయోగిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు కేరళ ఓటర్లను ఆకర్షిస్తాయని యూడీఎఫ్ (UDF) కూటమి భావిస్తోంది. పినరాయి విజయన్ ప్రభుత్వం నిరుద్యోగం, పెట్టుబడుల ఆకర్షణలో విఫలమైందని రేవంత్ విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, కేరళలో అధికార ఎల్డీఎఫ్ (LDF) మరియు బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న ఆయన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.


Full View


Tags:    

Similar News