Burning Topic: పుదుచ్చేరిలో పార్టీల మధ్య పోటా పోటీ.. గెలుపెవరిది..?

Burning Topic: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రంగస్వామి మరియు మాజీ సీఎం వైద్యలింగం మధ్య తట్టం చావడిలో హోరాహోరీ పోరు నెలకొంది.

Update: 2026-04-04 03:01 GMT

Burning Topic: పుదుచ్చేరిలో పార్టీల మధ్య పోటా పోటీ.. గెలుపెవరిది..?

Burning Topic: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి కొనసాగుతుండగా, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమిని ఢీకొనేందుకు కాంగ్రెస్-డీఎంకే కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారి ఎన్నికల్లో 'రాష్ట్ర హోదా' ప్రధాన అంశంగా నిలుస్తోంది. 

ముఖ్యమంత్రి రంగస్వామి తన సొంత నియోజకవర్గమైన తట్టం చావడి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయనను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ఎంపీ వి. వైద్యలింగంను రంగంలోకి దించింది. ఒకప్పుడు ఒకే పార్టీలో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారడం విశేషం. వైద్యలింగం కుటుంబానికి పుదుచ్చేరి రాజకీయాల్లో లోతైన మూలాలు ఉన్నాయి; ఆయన తండ్రి వెంకట సుబ్బారెడ్డి కూడా గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.


Full View


Tags:    

Similar News