Burning Topic: ఇరాన్ కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్.. నాటో నుంచి అమెరికా ఔట్..?

Burning Topic: ఇరాన్ తన మొండివైఖరి వీడి చర్చలకు రాకపోతే ఆ దేశాన్ని రాతి యుగంలోకి తీసుకెళ్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Update: 2026-04-03 05:10 GMT

Burning Topic: ఇరాన్ కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్.. నాటో నుంచి అమెరికా ఔట్..?

Burning Topic: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ ప్రభుత్వం తమ షరతులకు లోబడి ఒప్పందం కుదుర్చుకోకపోతే, ఆ దేశాన్ని రాతి యుగంలోకి తీసుకెళ్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ' ద్వారా ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, క్షిపణి మరియు డ్రోన్ సామర్థ్యాలు చిద్రమయ్యాయని ఆయన వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఘాటుగా స్పందించారు. బ్రిటన్ నిర్ణయాలన్నీ జాతీయ ప్రయోజనాల కోసమే ఉంటాయని, ఈ యుద్ధంలో తాము నేరుగా భాగస్వాములు కాలేమని స్పష్టం చేశారు. అటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ ఆల్బనీస్ స్పందిస్తూ, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంతటి తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.


Full View


Tags:    

Similar News