Burning Topic: యుద్ధం ఎఫెక్ట్ సంక్షోభంలో భారత్!

Burning Topic: పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత వ్యవసాయ రంగానికి ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. రైతులకు ఇబ్బంది కలగకుండా కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

Update: 2026-03-31 10:31 GMT

Burning Topic: యుద్ధం ఎఫెక్ట్ సంక్షోభంలో భారత్!

Burning Topic: పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ జ్వాలలు భారతీయ వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుండి భారత్‌కు అందాల్సిన ముడిచమురుతో పాటు ఎల్ఎన్జీ (LNG) మరియు ఎరువుల సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు స్తంభించడంతో ఎరువుల దిగుమతులు నిలిచిపోయాయి.

భారత్ తన యూరియా అవసరాలలో దాదాపు 46% ఒమన్ దేశం నుండే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర 50% పెరిగి టన్నుకు రూ. 68,170కి చేరింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 94,850 వరకు వెళ్లొచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దేశీయంగా యూరియా తయారు చేసే ప్లాంట్లు కూడా ఎల్ఎన్జీ కొరతతో కేవలం సగం సామర్థ్యంతోనే నడుస్తున్నాయి.


Full View


Tags:    

Similar News