Srikakulam: ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపు జగ్జీవన్ రామ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుందాం!
Srikakulam: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనన్యం అన్న ఎమ్మెల్యే.
Srikakulam: ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపు జగ్జీవన్ రామ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుందాం!
Srikakulam: భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానేత, స్వాతంత్ర్య సమరయోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు..
ఈ సందర్బంగా శిరీష గారు మాట్లాడుతూ..
బాబు జగజీవన్ రామ్ గారు సామాన్య ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన దూరదృష్టి కలిగిన నాయకుడు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు భారతదేశ రాజకీయ, సామాజిక రంగాలకు చిరస్మరణీయమైనవి.
ఈ కార్యక్రమంనకు పలాస -కాశీబుగ్గ మున్సిపాలిటీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.