Srikakulam: అచ్చెన్నాయుడు తాగిన మైకంలో మాట్లాడుతున్నారు!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్ఆర్సీపీ నేత పేరాడ తిలక్ కూటమి ప్రభుత్వం మరియు కింజరాపు కుటుంబంపై విమర్శలు గుప్పించారు.

Update: 2026-04-02 11:03 GMT

Srikakulam: అచ్చెన్నాయుడు తాగిన మైకంలో మాట్లాడుతున్నారు!

టెక్కలి(శ్రీకాకుళం): కింజరాపు కుటుంబంపై వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ పేరడ తిలక్ తీవ్ర విమర్శలు చేశారు, ఈ సందర్భంగా టెక్కలి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబ ప్రభుత్వంపై మరియు కింజరపు కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, ఎలక్ట్రానిక్ మీడియా- ప్రింట్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు , రామ్మోహన్ నాయుడు ఎలా క్రెడిట్ చోరీ చేస్తున్నాడో ప్రజలందరికీ అర్థమైంది అని తెలిపారు, పోర్టుకు పోదాం రండి సభ కు జిల్లావ్యాప్తంగా విజయవంతం కావడంతో పిచ్చి ప్రేలాపనలతో అచ్చెన్నా యుడు రగిలిపోతున్నాదంటూ తిలక్ ధ్వజమెత్తారు.

తాగిన మైకంలో తాను మంత్రి అనే విషయం మర్చిపోయి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడంటూ నిప్పులు చెరిగారు, పోర్టుకు 40 మందికి అనుమతిలిస్తే పోర్టు రహదారిని , బ్యాడ్ గేట్స్ తో, టిప్పర్లతో అడ్డంపెట్టి పోలీసులను పెట్టి అడ్డుకోవలసిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు, పోర్టుకి 40 మందికి అనుమతులు ఉంటే కలెక్టర్ ద్వారా ఎస్పీ ద్వారా బహిర్గతం చేయమని చెప్పి కోరారు, సాంకేతికంగా భావనపాడు లో పోర్టు పనికిరాదని సర్వేలో తేలిన తర్వాతే దాని మూలపేటకు మార్చడం జరిగిందని తెలిపారు, 2014 లో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో భావనపాడు పోర్టు నిర్మాణం ఎక్కడ జరిగింది అన్నది బహిర్గతం చేయండి అంటూ సూటిగా ప్రశ్నించిన పేరడ తిలక్, ప్రతీ నెల పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం చేసే కార్యక్రమం వంకతో ప్రతీ సారి జగన్మోహన్ రెడ్డి గారినీ తిట్టే కార్యక్రమం మాత్రమే పెట్టుకుని కక్ష సాధింపు చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజలందరికీ ఒక దగ్గర తీసుకొచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు చేసే పనినీ, వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పైన చర్చికి సిద్ధమా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం మరియు దుర్భాషలతో మాట్లాడటం కోసమే రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా ఒకటో తేదీన తెలుగుదేశం నాయకులు ప్రధానమైన ఎజెండా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పై తిలక్ విమర్శ ఒక తెలుగుదేశం కార్యకర్త కలెక్టర్ ను కొడతామని మాట్లాడితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా కనీసం కంప్లీట్ ఇచ్చుకోలేని అసమర్ధ కలెక్టరు అని విమర్శ, ఒక రాష్ట్ర మంత్రి ఏం చెబితే కలెక్టర్ గంగిరెద్దు లా తల ఊపడానికి మాత్రమే కలెక్టర్ ఉన్నది అని విమర్శ.

వైఎస్ఆర్సిపి హయంలో 2024 మే వరకు విశ్వసముద్ర ఏజెన్సీకి ఎంత బిల్స్ ఇచ్చారో,తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ 22 నెలల్లో విశ్వసముద్ర ఎంత బిల్ల్స్ ఇచ్చారు భహిర్గతం చేయమని సవాల్ విసిరారు, వాటి ద్వారానే వాటి ఆధారంగా ఏ ప్రభుత్వ హయాంలో పో పనులు జరిగాయో భహిర్గతమవుతుంది అని తెలిపారు. పోర్ట్ పేరుతో ప్రజలను మోసం చేసి కేవలం రియల్ ఎస్టేట్ దందాల కోసమే 36,000 ఎకరాలు దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ అక్రమ భూసేకరణ ఆపకపోతే దాదాపు 10,000 మంది రైతులతో ధర్నాలు చేసి రైతుల తరఫున వైఎస్ఆర్సిపి పోరాడుతుందంటూ హెచ్చరించారు.

Tags:    

Similar News