మా భూమి ఇప్పించండి: టీడీపీ నేతలకు బాధితుడి వినతి

తన భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారని, తన భూమిని తనకు ఇప్పించమని అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలుపుల గ్రామానికి చెందిన సుధీర్ ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డిలను అభ్యర్ధించారు.

Update: 2025-12-29 15:01 GMT

మంగళగిరి: తన భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారని, తన భూమిని తనకు ఇప్పించమని అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలుపుల గ్రామానికి చెందిన సుధీర్ ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డిలను అభ్యర్ధించారు.

‘‘ మా గ్రామంలో సర్వే నెం. 573లో 9.98 సెంట్ల భూమి మా కుటుంబానికి ఉంది. మా పెదనాన్న వారి అవసరాల కోసం 4.9 సెంట్ల భూమిని కొందరు నాగులబ్బ కుమారులు (వెంకటరమణ, జనార్దన, చంద్రశేఖర, మరొకరికి)కు విక్రయించారు. అయితే, వారు కొనుగోలు చేసిన భూమి కాకుండా, 1.60 సెంట్లు మా భూమిని ఆక్రమించారు. మేము తహసీల్దార్ ద్వారా సర్వే చేయించగా, 1.60 సెంట్ల అదనపు భూమి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ, వారు భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఆ వ్యక్తులు వైసీపీ నాయకులు కావడం వలన గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.’’ అని సుధీర్ తన బాధను వివరించారు.

విశాఖపట్నంకు చెందిన చంద్రశేఖర్ మరో అర్జీ ఇచ్చి, తనకు న్యాయం చేయమని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా పొన్నం రెవిన్యూ గ్రామంలో సర్వే నెం. 121–4లోని జిరాయితీ మెట్ట భూమి కోర్టు తీర్పు మేరకు 10-09-2023న రిజిస్ట్రేషన్ జరిగి, రెవిన్యూ రికార్డులలో తమ పేరున ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ, భూమికి సంబంధం లేని గంటా ఉపేంద్ర, అతని అనుచరులైన వైసీపీ నేతలు నీలంశెట్టి రామకృష్ణ (సర్పంచ్), రావాడ మోహన రావు (ఎంపీటీసీ) జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోని అక్రమ కబ్జా ప్రయత్నాలను నిలిపివేసి, తమకు రక్షణ కల్పించాని కోరారు.

Tags:    

Similar News