Ichchapuram: ఇచ్ఛాపురంలో కాగడాల కాంతి.. అమరావతికి దక్కిన పార్లమెంట్ సమ్మతి!
Ichchapuram: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యే బెండాళం అశోక్ ఆధ్వర్యంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు.
Ichchapuram: ఇచ్ఛాపురంలో కాగడాల కాంతి.. అమరావతికి దక్కిన పార్లమెంట్ సమ్మతి!
Srikakulam: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ఇక అమరావతేనని, భవిష్యత్తులో ఎవరూ దీనిని మార్చలేరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ బెండాళం అశోక్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన ఇచ్ఛాపురంలో కూటమి శ్రేణులు కాగడాలతో అట్టహాసంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషితో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఇది సాధ్యమైందని వివరించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింప జేసిన ప్రధాని మోదీకి, వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ 12 ఏళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే మద్దతు తెలిపిన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ తర్వాత మాట మార్చి మూడు రాజధానులంటూ విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
అప్పట్లో రాజధానికి 30 వేల ఎకరాలు కావలంటూ చెప్పిన జగన్ తర్వాత 500 ఎకరాలు సరిపోతాయన్నారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని, ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగలేదని చెప్పారు. జగన్ విధ్వంస పాలనలో అమరావతి రైతులు ఎన్నో పాట్లు పడ్డారని చెప్పారు. ఇప్పుడు మావిగన్ అంటూ జగన్ మోహన్రెడ్డి ప్రజల్లో నవ్వుల పాలయ్యాయన్నారు. అనురావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించాలని తనతోపాటు రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు కూటమి నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అశోక్ ప్రకటించారు.
ఈ విజయోత్సవ ర్యాలీలో ఏపీ రెడ్డిక కార్పోరేషన్ చైర్మన్ కొండా శంకర రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకట రమణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లట రాజు, పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పత్రి తవిటయ్య, నందిగాం కోటి, మండల టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లోపించి పద్మనాభం, దక్కత కామేశు, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుష్ రంగా, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కాళ్ల జైదేవ్, తాజా మాజీ కౌన్సిలర్లు కాళ్ల దిలీప్కుమార్, గేదెల శేఖర్, నారాయణ బెహరా, బీలారాణి, ఏపీ కళింగ వైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ వూనా సంతోష్ కుమార్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు బత్తిన కృష్ణయ్య, పట్టణ టీడీపీ పూర్వ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాళ్ల ధర్మారావు, నందిక జానీ, పట్టణ టీడీపీ కార్యదర్శి శాసన శేఖర్, టీడీపీ వార్డు ఇన్చార్జిలు కొర్రాయి ధర్మరాజు, జన్నెల సంతోష్, బుగత జగన్, లెంక ప్రకాష్, సుభాష్ రౌలో, సంతోష్ రథో, పట్టణ టీడీపీ నిర్వాహక కార్యదర్శులు దట్టి శ్రీను, నీలాపు వెంకటరెడ్డి, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఆశి ధర్మరాజు రెడ్డి, మున్సిపల్ బాలికోన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గిన్ని వెంకటరమణ, పార్టీ నేతలు రాహుల్ కుమార్ సాహు, ఆశి మోహన్, దద్ద గిరీష్, దక్కత విశ్వేశ్వరరావు, లింగరాజు, గిలాలు కృష్ణ, దొరబాబు, నిమ్మన మోహన్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.