SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన కెప్టెన్!
SRH: ఎస్ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్ తగిలింది. వెన్ను గాయంతో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సన్‌రైజర్స్ శిబిరాన్ని వీడి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు.
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన కెప్టెన్!
SRH: ఐపీఎల్ 2026 సీజన్‌లో బోణి కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)కు బిగ్ షాక్ తగిలింది. వెన్ను గాయం (బ్యాక్ ఇంజరీ)తో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. ఎస్ఆర్‌హెచ్ శిబిరాన్ని వీడి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్ అనంతరం కమిన్స్ ఇండియాను విడిచినట్లు సమాచారం. వెన్ను గాయంకు సంబంధించి తుది స్కాన్ల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. ఆస్ట్రేలియా వైద్య బృందం కమ్మిన్స్‌కు సిగ్నల్ ఇస్తే.. ఏప్రిల్ 17న మళ్లీ సన్‌రైజర్స్ జట్టులో చేరే అవకాశముంది. దాంతో ఐపీఎల్ 2026లో ఎస్ఆర్‌హెచ్ ఆడే మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
వెన్ను గాయం కారణంగా గత సంవత్సరం జూలై తర్వాత పాట్ కమిన్స్ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. అడిలైడ్‌లో జరిగిన ఒకే ఒక్క యాషెస్ టెస్టులో మాత్రమే అతను ఆడాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో భాగంగా నెట్ సెషన్‌లలో బౌలింగ్ ప్రారంభించినట్లు కమిన్స్ స్వయంగా వెల్లడించాడు. తన ఫిట్‌నెస్‌ను క్రమంగా మెరుగుపరుచుకుంటూ తిరిగి ఫుల్ ఫిట్‌గా రావడానికి కృషి చేస్తున్నట్లు ఐపీఎల్ 2026 ముందు చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభ దశకు తాను అందుబాటులో ఉండనని, త్వరలోనే మైదానంలోకి తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా పిలుపు మేరకు ఆసీస్ వెళిపోయాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే కనీసం మూడు మ్యాచ్‌లకు పాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండడు. ఏప్రిల్ 17న ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో కలిసే అవకాశముంది. అప్పటివరకు తాత్కాలిక కెప్టెన్‌గా భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. అయితే రెండో మ్యాచ్‌లో కోల్‌కతాపై భారీ విజయం సాధించి ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం జట్టు మంచి జోష్‌లో ఉంది. ఏప్రిల్ 5న తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ఎదుర్కోనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఆరో స్ధానంలో కొనసాగుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (తాత్కాలిక కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఈషాన్ మలింగ, శివమ్ మావి, స్మరన్ రవిచంద్రన్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, క్రెయిన్స్ ఫులేట్రా, అమిత్ కుమార్, ఓంకార్ తర్మలే, శివంగ్ కుమార్.