LSG vs GT: ప్రసిద్ధ్‌ కృష్ణ దెబ్బ, లక్నో అబ్బా.. గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యం!

LSG vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా ఎల్‌ఎస్‌జీ, జీటీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది.

Update: 2026-04-12 12:09 GMT

LSG vs GT: ప్రసిద్ధ్‌ కృష్ణ దెబ్బ, లక్నో అబ్బా.. గుజరాత్ ముందు మోస్తరు లక్ష్యం!

LSG vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ), గుజరాత్ టైటాన్స్‌ (జీటీ) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 రన్ చేసింది. దాంతో గుజరాత్ ముందు 165 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది. లక్నోలో టాప్ స్టార్స్ ఉన్నా బ్యాటింగ్‌లో విఫలమైంది. ఎల్‌ఎస్‌జీ తరఫున ఐడెన్ మార్‌క్రమ్ (30) టాప్ స్కోరర్. టాప్ ప్లేయర్స్ మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, నికోలస్ పూరన్ విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్‌ కృష్ణ 4 వికెట్స్ పడగొట్టాడు.

ఎల్‌ఎస్‌జీకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. రబాడ వేసిన మూడో బంతికి మిచెల్ మార్ష్‌ (11) ఔట్ అయ్యాడు. ఐడెన్ మార్‌క్రమ్, కెప్టెన్ రిషబ్ పంత్ (18) జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. 5వ ఓవర్లో పంత్ పెవిలియన్ చేరాడు. ధాటిగా ఆడే క్రమంలో మార్‌క్రమ్‌ అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్స్ పడగొట్టారు. నికోలస్ పూరన్ (19), ఆయుష్‌ బదోని (9), అబ్దుల్ సమద్ (18) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. 15 ఓవర్లకు లక్నో స్కోర్ 110/5గా నిలిచింది. చివర్లో ముకుల్ చౌదరి (18), లిండే (16), షమీ (12*) , అవేశ్ (4*) పరుగులు జోడించడంతో స్కోరు 160 దాటింది. ఇందులో 9 ఎక్స్‌ట్రాస్ కూడా ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతను 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ఎల్‌ఎస్‌జీని కట్టడి చేశాడు. సిరాజ్ 1 వికెట్‌ తీసినా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రబాడ (54) భారీగా రన్స్ ఇచ్చాడు. అశోక్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ వికెట్ తీయకపోయినా బాగా బౌలింగ్ చేశాడు. 165 పరుగుల లక్ష్యంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగనుంది.

Tags:    

Similar News