LSG vs GT: టాస్‌ నెగ్గిన గుజరాత్ టైటాన్స్‌.. తుది జట్లు ఇవే!

LSG vs GT: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో, గుజరాత్ జట్లు తలపడబోతున్న ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

Update: 2026-04-12 10:03 GMT

LSG vs GT: టాస్‌ నెగ్గిన గుజరాత్ టైటాన్స్‌.. తుది జట్లు ఇవే!

LSG vs GT: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌, గుజరాత్ టైటాన్స్‌ జట్లు తలపడబోతున్న ఈ మ్యాచ్ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో లక్నో ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

పిచ్ పరిస్థితులు, డ్యూ ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నట్లు శుభ్‌మన్ గిల్ చెప్పాడు. గత మ్యాచ్‌లో సాధించిన విజయం తమకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని, ఈ మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లకుండా గెలవాలని గిల్ పేర్కొన్నాడు. మరోవైపు లక్నో కెప్టెన్ పంత్ మాట్లాడుతూ పిచ్ పరిస్థితులు మారుతూ ఉండటంతో బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకోవడంలో పెద్ద తేడా లేదన్నాడు. గత మ్యాచ్ విజయంతో టీమ్‌లో మంచి ఉత్సాహం నెలకొందని, ప్రతి మ్యాచ్‌ను కొత్తగా తీసుకుని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యమని తెలిపాడు. టీమ్‌లో ఇంటెంట్ చాలా ముఖ్యమని, అదే విజయానికి కీలకమని పేర్కొన్నాడు.

ఇరు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ గణాంకాలను పరిశీలిస్తే.. లక్నో, గుజరాత్ టీమ్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా జీటీ నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. లక్నో మూడు మ్యాచ్‌లలో గెలిచింది. దీంతో ఈ పోరు ఆయాసక్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లక్నో జట్టులో మార్ష్, మార్‌క్రమ్, పంత్, పూరన్ వంటి టాప్ బ్యాటర్లు ఉండగా.. బౌలింగ్‌లో షమీ, ఆవేశ్ కీలకం కానున్నారు. గుజరాత్ జట్టులో గిల్, బట్లర్, ఫిలిప్స్, రషీద్, రబాడ, సిరాజ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.

తుది జట్లు:

లక్నో: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్/కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమి, అవేశ్‌ ఖాన్, దిగ్వేశ్‌ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

గుజరాత్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

గుజరాత్‌: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖెజ్రోలియా, అనుజ్ రావత్.

లక్నో: మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్క్జ్‌, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్.

Tags:    

Similar News