SRH Record: ఆ కొట్టుడు ఏంది సామీ.. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో అరుదైన రికార్డు!

SRH Powerplay Record IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. పవర్‌ప్లేలో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా మరోసారి రికార్డులో నిలిచింది.

Update: 2026-04-11 12:07 GMT

SRH Record

SRH Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. పవర్‌ప్లేలో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా మరోసారి రికార్డులో నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటికే మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి మూడో స్థానంను లాగేసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ 105 రన్స్ చేసింది. దాంతో పవర్‌ప్లేలో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ టాప్ 3 స్థానాల్లో నిలిచింది.

ఐపీఎల్‌లో పవర్‌ప్లే ఓవర్లు మ్యాచ్‌కు చాలా కీలకం. ఈ ఆరు ఓవర్లలోనే బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తుంటారు. అయితే కొన్ని మ్యాచ్‌లలో ఈ పవర్‌ప్లే పూర్తిగా బ్యాటింగ్ ఫెస్టివల్‌లా ఉంటుంది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయి స్కోర్లు నమోదయ్యాయి. అలాంటి అరుదైన సందర్భాలు ఐపీఎల్ చరిత్రలో చాలా తక్కువగా ఉండగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం తనదైన ముద్ర వేస్తోంది. పవర్‌ప్లేలో అత్యధిక రన్స్ 20024లో రెండుసార్లు, 2026లో ఓసారి నమోదయ్యాయి. మూడుసార్లు కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు.

2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసింది. ఇది ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌గా ఉంది. అదే ఏడాది లక్నోపై హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా ఎస్‌ఆర్‌హెచ్ 107/0 స్కోర్ చేసింది. తాజాగా 2026 సీజన్‌లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై మరోసారి భారీ స్కోర్ చేసింది. తొలి ఆరు ఓవర్లలోనే 105 పరుగులు చేసి మ్యాచ్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది. 2017లో బెంగళూరులో ఆర్సీబీపై కేకేఆర్ 105/0 స్కోర్ నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ 2014లో ముంబైలో పంజాబ్‌పై 100/2 స్కోర్ చేసి జాబితాలో చోటు దక్కించుకుంది. మొదటి మూడు స్థానాలు ఎస్‌ఆర్‌హెచ్ జట్టువే కావడంతో.. ఆ కొట్టుడు ఏంది సామీ అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు

Tags:    

Similar News