PBKS vs SRH: భారీ స్కోర్ చేసినా ఎస్‌ఆర్‌హెచ్‌కు తప్పని ఓటమి!

PBKS vs SRH: ఐపీఎల్‌ 2026లో భాగంగా ముల్లన్ పూర్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత విజయం సాధించింది.

Update: 2026-04-11 14:04 GMT

PBKS vs SRH: భారీ స్కోర్ చేసినా ఎస్‌ఆర్‌హెచ్‌కు తప్పని ఓటమి!

PBKS vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026లో భాగంగా ముల్లన్ పూర్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 220 పరుగుల లక్షాన్ని పీబీకేఎస్ మరో 7 బంతులు ఉండగానే 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (69 నాటౌట్), ఓపెనర్ ప్రియాంశ్‌ ఆర్య (57) సునామీ ఇన్నింగ్స్‌లు ఆడడంతో పంజాబ్ సునాయాస విజయంను ఆడుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో శివాంగ్‌ కుమార్‌ మూడు వికెట్స్ పడగొట్టాడు.

భారీ ఛేదనలో పంజాబ్ జట్టుకు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్యలు దంచి కొట్టారు. ఏ బౌలర్ వేసినా బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో 6 ఓవర్లకు స్కోర్‌ 93 రన్స్ చేసింది. 16 బంతుల్లో ప్రియాంశ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శివాంగ్‌ కుమార్‌ బౌలింగ్‌లో (6.2) ప్రియాంశ్‌ అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ప్రభ్‌సిమ్రన్‌ను శివాంగ్‌ పెవిలియన్ చేర్చాడు. కూపర్‌ (11) నిరాశపర్చినా.. శ్రేయాస్ అయ్యర్ రెచ్చిపోయాడు. 24 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌.. శశాంక్‌ సింగ్‌ (16) అండతో జట్టుకు విజయాన్ని అందించాడు. లక్ష్యాన్ని పంజాబ్‌ 18.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 38 పరుగులు చేశాడు. ఓపెనర్ల ధాటికి ఎస్‌ఆర్‌హెచ్ 8 ఓవర్లకే 120 పరుగులు చేసింది. ఒకే ఓవర్‌లో అభిషేక్, హెడ్ పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ స్కోర్ వేగం తగ్గింది. ఇషాన్ కిషన్ (27), హెన్రిచ్ క్లాసెన్ (39), అనికేత్ వర్మ (18) రన్స్ చేశారు. ఇన్నింగ్స్ చివరలో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో 250కి పైగా వెళ్లాల్సిన స్కోరు 220కే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ 2 వికెట్లు తీయగా.. బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.

Tags:    

Similar News