Markapuram: పుట్టిన ఊరును వీడుతున్న వెలిగొండ నిర్వాసితులు: కన్నీటి వీడ్కోలు!

Markapuram: వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు జరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలు కన్నీళ్లతో పుట్టిన ఊళ్లను ఖాళీ చేస్తున్నారు.

Update: 2026-08-21 11:17 GMT

Markapuram: పుట్టిన ఊరును వీడుతున్న వెలిగొండ నిర్వాసితులు: కన్నీటి వీడ్కోలు!

మార్కాపురం: మార్కాపురం జిల్లా శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో నీటి విడుదలకు అధికారులు ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ముంపు ప్రాంతాల్లోని ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పొందిన నిర్వాసితులు ఒక్కొక్కరిగా పుట్టిన ఊర్లను ఖాళీ చేస్తున్నారు. “ఈ ఊర్లో మాకు ఇంకా ఏం ఉంది అక్కా ఓ..” అంటూ పెట్టెబేడ సర్దుకుని.. పుట్టిన ఊరు, కట్టుకున్న ఇళ్లు, సాగు చేసిన పొలాలను వదిలి వెళ్తున్న నిర్వాసితుల దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

ఈ నెల 26లోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ప్రాజెక్టులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నష్టపరిహారం, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అందించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

ఇప్పటికీ ప్యాకేజీ అందని కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని.. 18 ఏళ్లు నిండిన యువతకు కూడా ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. “సర్వస్వం కోల్పోతున్నాం.. కనీసం ప్యాకేజీఅయినా న్యాయంగా ఇవ్వండి” అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News