Eluru: వేలేరుపాడు వీక్లీ మార్కెట్ వేలం.. పోటాపోటీగా పాల్గొన్న వేలం దారులు!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు వారాంతపు సంత బహిరంగ వేలం పాట వివరాలు. రూ. 55,500లకు సంతను దక్కించుకున్న ఎర్రబోరు వాసి చిట్టిపోతుల రాంబాబు.
Eluru: వేలేరుపాడు వీక్లీ మార్కెట్ వేలం.. పోటాపోటీగా పాల్గొన్న వేలం దారులు!
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో గల వారాంతపు సంతను వేలేరుపాడు మండల పరిధిలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన చిట్టి పోతుల రాంబాబు రూ. 55 వేల 5 వందలకు దక్కించుకున్నాడు. స్థానిక సంత డిప్యూటీ ఎంపీడీవో, సర్పంచ్ వెంకటమ్మ, సెక్రెటరీ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో శుక్రవారం సంత బహిరంగ వేలం పాటను నిర్వహించారు. ఈ సంవత్సరం నిర్వహించిన ఈ వేలం పాటలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు పోటీ పడగా మహేశ్ గతేడాది కంటే రూ 4 వేలు తక్కువ లోనే వేలం దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో రేపాక గోమ్ము సర్పంచ్ సోడే, వెంకమ్మ, మాజీ జెడ్పిటీసీ సభ్యులు శాఖమూరి సంజీవులు, సచివాలయ సిబ్బంది, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.